Manasa

మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

మనసా
శిరసా
నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో
శివశంకర వణికింపగ శరణని
మనసా
శిరసా
నీ నామము చేసెదనీ వేళ

తాండవమాడే నటుడైనా
తలిచిన వేళ హితుడేలే
తాండవమాడే నటుడైనా
తలిచిన వేళ హితుడేలే
గిరిజనులే ఆ శివున్ని గురి విడక ధ్యానించు
ఆ శివ శంకర నామము చేసిన నీకిక చింతలు ఉండవులే
బెరుకుమాని ప్రేమించి
ప్రేమ మీద లాలించె
యముడు చూపు తప్పించి
తప్పులున్న మన్నించేయ్
ఇష్టదైవమతని మీద దృష్టిని నిలిపి శివుని పిలవ వేళ
ఓ మనసా
శిరసా
నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో
భయ కంపనమో
శివశంకర వణికింపగ శరణని
మనసా
శిరసా
నీ నామము చేసెదనీ వేళ

సప్త మహర్షుల సన్నిధిలో
గరి రిస సని నిద దప
పగమపదస పదసరిగమ గ
సప్త మహర్షుల సన్నిధిలో
సప్త మహర్షుల సన్నిధిలో
సప్త స్వరాల ప్రియ శృతిలో
గౌరి వలె ఆ శివుని గౌరవమే కాపాడు

ఆ నవజాతకు ఈ భువజాతకు కలిసిన జాతకమీ వరుడే
లంక చెరను విడిపించి
శంకలన్నీ తొలగించి
ఈసులన్నీ కరిగించి
నీ సుశీల మెరిగించె
లగ్నమైన మనసుతోడ పెళ్ళికి లగ్నమిపుడు కుదురు వేళ

ఓ మనసా
శిరసా
నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో
శివశంకర వణికింపగ శరణని
మనసా
శిరసా
నీ నామము చేసెదనీ వేళ



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link