Pattudhalatho

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏనాడూ వెనకడుగేయక, ఏ అడుగూ తడబడనీయక
నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యనే
కష్టం అంటే దూది కూడా భారమే
లక్ష్యమంటూ లేని జన్మే దండగ
లక్షలాది మందిలేరా మందగా
పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేరు కదా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే
చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా
ఎక్కలేని కొండనేది లేదురా
నవ్వే వాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోరా మరి
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏనాడూ వెనకడుగేయక, ఏ అడుగూ తడబడనీయక
నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link