Uppongela Godavari

షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే

(సాస పాప పప పమరిస సనిస)
(సాస పాప పప పమదపపా)
(సాస పాప పప పమరిస సనిస)
(సాస పాప పప పమనిదప)

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బార్సెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకం బొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బార్సెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి



Credits
Writer(s): Veturi Murthy, K Radhakrishna
Lyrics powered by www.musixmatch.com

Link