Sogasu Choodatharama

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా

సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా

హా సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా
ఊహల్లో తేలీ నీ వళ్ళో వాలీ నాప్రేమ ఊసులాడనీవా
పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడూ గట్టిమేళా
బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వానా
నన్ను వలచినవాడు వరుడై రాగా ఆదమరచిపోనా

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా హో
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా

సాహిత్యం: కులశేఖర్

Credits
Writer(s): Harris Jayaraj, Kula Shekar
Lyrics powered by www.musixmatch.com

Link