Anaganaganaga

చీకటి లాంటి పగటి పూట కత్తుల్లాంటి పూలతోట
జరిగిందొక్క వింత వేట
పులిపై పడిన లేడి కథ వింటారా
జాబిలి రాని రాతిరంతా
జాలే లేని పిల్ల వెంట
అలికిడి లేని అల్లరంతా
గుండెల్లోకి దూరి అది చూస్తారా

చుట్టూ ఎవ్వరూ లేరు
సాయం ఎవ్వరూ రారు
చుట్టూ ఎవ్వరూ లేరు సాయం ఎవ్వరూ రారు
నాపై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి పోరు
అనగనగనగా అరవిందట తన పేరు
అందానికి సొoతూరు
అందుకనే ఆ పొగరు
అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు
అసలేమైపోతారు అన్యాయం కద ఇది అనరే ఎవ్వరూ

హే... ప్రతి నిముషము తనవెంట
పడిగాపులే పడుతుంటా
ఒకసారి కూడ చూడకుంది క్రీగంట
ఏమున్నదో తన చెంత ఇంకెవరికీ లేనంత
అయస్కాంతమల్లె లాగుతోంది నన్ను చూస్తూనే ఆ కాంత
తను ఎంత చేరువనున్నా అద్దంలో ఉండే ప్రతిబింబం అందునా
అంతా మాయలా ఉంది అయినా హాయిగా ఉంది
భ్రమలా ఉన్నా బానే ఉందే ఇదేమి తీరు

(మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద
మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా
మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద
మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా)

అనగనగనగా అరవిందట తన పేరు
అందానికి సొంతూరు
అందుకనే ఆ పొగరు
అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు
అసలేమైపోతారు అన్యాయం కద ఇది అనరే ఎవ్వరూ

(మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద
మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా
మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద
మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా)

(అనగనగనగా)

పులిపై పడిన లేడి కథ వింటారా



Credits
Writer(s): Sai Srinivas Thaman, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link