Manasuna Mansuga

మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రావా
మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రావా

మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే
ప్రేమావరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొను
కౌగిట ఒదిగి ఉండనీవా
నా గుండె కోవెల విడిచి
వెళ్ళ తగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి
పూజించే వేళ
నిరీక్షించు స్నేహం కోరి
జతనై రానా రానా
ఉప్పొంగి పోయే ప్రాయం
నిన్ను విడువదు ఏ వేళైనా
నా శ్వాస ప్రతి పూట
వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలు నేనుంటా
నీ జంట
మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రావా

పువ్వై నవ్వులని తేనై మాధురిని
పంచే పాట మన ప్రేమా
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల
పలికే కవిత మన ప్రేమా
కాలాన్ని పరిపాలిద్దాం కన్న
కలలే నిజమై
వేటాడు ఏ ఎడబాటు
ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా
ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చెరి సగం అవుదాం
వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది
మధు గీతం
తుదే లేని ఆనందం వేచేనే
నీ కోసం

మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గ
పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రావా



Credits
Writer(s): A R Rahman, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link