Amma Amma

అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా
మాటే లేకుండా నువ్వే మాయం
కన్నీరవుతోంది ఎదలో గాయం
అయ్యో వెళ్లిపోయావే
నన్నొదిలేసి ఎటుపోయావే
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
నేపాడే జోలకు నువు
కన్నెత్తి చూశావో అంతేచాలంటా

అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా

చెరిగింది దీపం కరిగింది రూపం
అమ్మా నాపై ఏమంత కోపం
కొండంత శోకం నేనున్న లోకం
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం
నాకే ఎందుకు శాపం
జన్మల గతమే చేసిన పాపం
పగలే దిగులైనా నడిరేయి ముసిరింది
కలవరపెడుతోందీ పెను చీకటీ
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది
బ్రతికీ సుఖమేమిటీ

ఓ అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా

విడలేక నిన్ను విడిపోయి ఉన్నా
కలిసే లేనా నీ శ్వాస లోనా
మరణాన్ని మరచి జీవించి ఉన్నా
ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా
నిజమై నే లేకున్నా
కన్నా నిన్నే కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా
కలతను రానీకు కన్నంచునా
కసిరే శిశిరాన్నే వెలివేసి త్వరలోనా
చిగురై నిను చేరనా

అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా
అడుగై నీతోనే నడిచొస్తున్నా
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా
అయ్యో వెళ్లిపోయావే
నీలో ప్రాణం నా చిరునవ్వే
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
వెన్నంటీ చిరుగాలై జన్మంతా
జోలాలీ వినిపిస్తూ ఉంటా



Credits
Writer(s): Anirudh Ravichander, Dhanush Kasthoori Raja
Lyrics powered by www.musixmatch.com

Link