Rama Rama

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత బక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా
ఇద్దరి లక్షణం ఒకటేగా
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత బక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లేసీమా
నాన్నలే నడిపించింది ఊరంత ప్రేమ

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లేసీమా
నాన్నలే నడిపించింది ఊరంత ప్రేమ
ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్నీ సొంత ఇళ్ళే ఱంతా అయినవాళ్ళే
ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం
బతుకంతా ఇది తీరే రుణమా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత బక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మా
ఏ బాటచూపిస్తావో కానున్న బ్రహ్మా
ప్రస్సన్నాంజనేయం అనే నామధేయం
ప్రతిమంచి కార్యం జరిపించు దైవం
ప్రబాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నావెంటే నువ్వుంటే భయమా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత బక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా ఱచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా
ఇద్దరి లక్షణం ఒకటేగా



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link