Manakannapodichey

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి
దూరం పెంచినా కరిగించానుగా
కళ్ళెం వేసినా కదిలొస్తాను గా

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి

అసలిట్టా నీ వెంట నేనెట్టా పడ్డానే
అనుకుంటె అప్సరసైన నా గుమ్మంలోకొస్తాదే
విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దే
చనువిస్తే నా చిరు నవ్వే నీ పెదవుల్లో ఉంటాదే
ఇన్నాళ్లు భూలోకంలో ఏ మూలో ఉన్నావే
అందిస్తా ఆకాశాన్నె అంతో ఇంతో ప్రేమించావంటే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి

అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే
బలమైన వారధి కట్టి సీతని ఇట్టే పొందాడే
మన మధ్య నీ మౌనం సంద్రంలా నిండిందే
మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే
చంద్రున్నె చుట్టేస్తానే చేతుల్లో పెడతానే
ఇంక నువ్వు ఆలోచిస్తూ కాలన్నంతా ఖాలీ చెయ్యొద్దే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో



Credits
Writer(s): Mani Sharma, Ananth Sriram
Lyrics powered by www.musixmatch.com

Link