Jigi Jigi

జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాల రాజా నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం
నాదేలే మమతల మణిహారం
జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాల రాజా నీదేర ఈ రోజా

లాలీ లాలీ ప్రేమ రాణి అనురాగంలోనే సాగిపోనీ
మేనా లోనా చేరుకొనీ సురభోగాలన్నీ అందుకొనీ
పెదవి పెదవి కలవాలి యదలో మధువే కొసరాలి
బ్రతుకే మమతై నిలవాలి మురళీ స్వరమై పలకాలి
ప్రేయసి పలుకే మాణిక్య వీణ ప్రేమావేశంలోన
కౌగిలి విలువే వజ్రాల హారం మోహావేశంలోన
రావే రావే రస మందారమా

జిగిజిగిజిగిజా
జిగిజిగిజిగిజా ఓ బాల రాజా నీదేరా ఈ రోజా
జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా
నాదేలే మమతల మణిహారం
నీదేలే వలపుల వైభోగం

స్నానాలాడే మోహనాంగి ఇక సొంతం కావే శోభనాంగి
దూరాలన్నీ తీరిపోనీ రసతీరాలేవో చేరుకోనీ
తనువూ తనువూ కలిసాక వగలే ఒలికే శశిరేఖ
ఎగసే కెరటం యదలోన సరసం విరిసే సమయాన
ముందే నిలిచే ముత్యాల శాల పూవై నవ్వే వేళ
రమ్మని పిలిచే రత్నాల మేడ సంధ్య రాగంలోన
వలపే పలికే ఒక ఆలాపన

జిగిజిగిజిగిజా
జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాల రాజా నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం
నాదేలే మమతల మణిహారం

జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాల రాజా నీదేర ఈ రోజా



Credits
Writer(s): Ilaiyaraaja, Rao Ramalingeswara
Lyrics powered by www.musixmatch.com

Link