Phir Shuru

ఎగసిపడే కెరటాన్నే
ఆపేనా ఎవడైనా
మెరిసిపడే పిడుగులనే
ఆపేనా ఎవడైనా
చదరంగంలో చాణక్యుడికే
ఓటమి ఉందా ఏనాడైనా...
ఎదురడుగేసే ఆలోచనకే
వెనకడుగుందా ఎన్నటికైనా...
సుడిగాలిని కోసి దారిని తీసి దూకెయ్ బాణంలా...

फिर शुरू
चल गुरु
फिर शुरू
चल गुरु

వెలుగక్కడ లేదని చెప్పే
మాటేరా చీకటి అంటే
నిశి అన్నది లేనేలేదే...
ఆరాటం తోడై ఉంటే
పోరాటం మరి నీ వెంటే
ఓటమికే చోటే లేదే...
చినుకుల నడుమన తడవక సాగే
అర్జున వేగం క్షణమాగేనా...
నిలబడి పోరే నిలకడ తీరే గెలుపని చాటేలా...

फिर शुरू
चल गुरु
फिर शुरू
चल गुरु

మిణుగురు పురుగులు అణువంతైనా
అడవిని సైతం వెలిగించెయవా
చలి చీమలు చిరు చిగురంతైనా
వనసర్పమునే గెలిచెయవా...
చుక్కలు రేణువులంతే ఉన్నా
నింగిన రంగులు పొంగించెయవా
రెక్కలు ఇంతే పిసరంతైనా
దిక్కులనే శాసించెయవా...
కొమ్మల చాటున కోయిల పాటే
వేకువ బాటకు పిలుపే కాదా...
నీ పిడికిలిలోని అలికిడి జగతికి మెలకువ పాఠంలా...

फिर शुरू
चल गुरु
फिर शुरू
चल गुरु



Credits
Writer(s): Shreemani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link