Oopiri

ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొనఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొనఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే
నా (నా) మనసే (మనసే) నన్నే (నన్నే) వదిలి
వెళుతుందే నీతో ఎటువైపో
ఈ (ఈ) క్షణం (క్షణం) అయోమయం
ఇంతగా నన్నే కలవరపెడుతుందే

తడబడి తడబడి రా, తేనెపలుకై రా
కనపడి కలబడినా ప్రేమే ముడిపడునా
మధురం మధురం మధురం ఈ పరువం మధురం

ఊపిరి ఆడద నీకు - ఎదురు నువ్వైతే
నేనేం చేశా నేరం - ప్రాణం తీయకే
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం, ఓ కిలకిల చిలుకా రావే రావే
నీ కోసమా
మధురం మధురం పరువం

నా మనసే నన్నే వదిలి
వెళుతుందే నీతో ఎటువైపో ఎటువైపో
రా ఇలా సరాసరి
అనదే మరి నా మనసెందుకో

గడసరి మగసిరి నిన్ను కోరింది
సొగసిరి ఎద మరి తీరే మారింది
గుప్పెడు మనసే అలా ఎలా కొట్టేశావే
కనికట్టేదో కథాకళి కట్టిస్తుందే
మరువం మరువం పరువం చేసే గాయాలే

ఊపిరి ఆడదు నాకు - ఎదురు నే రానా
కొనఊపిరితో ఉన్నా - ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం, ఓ కిలకిల చిలుకా రావే రావే
నా కోసమే
మధురం మధురం పరువం

చినుకునై చిలిపిగా నిన్ను తడిమేయనా
గొడుగునై సొగసుపై నిన్ను ఆపేయనా
వయసొక నరకం వాంఛలే వేధిస్తుంటే
తియ్యని తమకం అమ్మో భయం ఏం చేస్తుందో
మరువం మరువం పరువం చేసే గాయాలే

ఊపిరి ఆడదు నాకు - ఎదురు నే రానా
కొనఊపిరితో ఉన్నా - ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం, ఓ కిలకిల చిలుకా రావే రావే
నా కోసమే - నీ కోసమే
మధురం మధురం పరువం



Credits
Writer(s): Krishna Chaitanya, Selva Ganesh
Lyrics powered by www.musixmatch.com

Link