Siri Siri Muvalle

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లే
కురిసింది గుండెల్లో వెనెల్లమ్మా

చిన్నారి పాపల్లె
చిరునవ్వుల సిరిమల్లె
సరిగమలే పాడింది కొనలమ్మా

ఎద లోతులో అలజడి రేగే నాలో
మరి మరి ఎందుకో పిలిచెను ప్రేమ నాలో

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లే
చిరునవ్వుల పిలుపల్లె

కలలో ఒక రూపమే
కనులకు తెర తీసేయి
వెలిగించని దీపమే
తొలి జిలుగులు కురిసే
అయినా మరి ఎందుకో
తడబడినది మనసు
ఇది ఏమో ఏమిటో
అది ఎవరికీ తెలుసు
ఒక వింతగా
పులకింతగా
తొలి తలపే
మది చాటుగా
సడి చేసినది ఎందుకు

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లే
చిరునవ్వుల పిలుపల్లె

ఎదలో రసవీణలే సరిగమలే పలికే
ఎదురయి విరివానలే మధురిమలే చిలికే
మాట నే మౌనమే
కల కాలములు రేపే
వెంటాడే స్నేహమే
కలవరములు చూపే
ఇది ఏమిటో
కథ ఏమిటో
తెలియని ఓ అనుమానమే
తెర తీసినదెందుకో

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లే
కురిసింది గుండెల్లో వెనెల్లమ్మా

చిన్నారి పాపల్లె
చిరునవ్వుల సిరిమల్లె
సరిగమలే పాడింది కూనలమ్మా

ఎద లోతులో అలజడి రేగే నాలో
మరి మరి ఎందుకో పిలిచెను ప్రేమ నాలో

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లే
చిరునవ్వుల పిలుపల్లె



Credits
Writer(s): Vennelakanti, Agastya
Lyrics powered by www.musixmatch.com

Link