Ee Velalo Neevu (From "Gulabi")

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నావైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము, గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము, నీ మీదనే ధ్యానము

ఏవైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వుకాక వేరేదీ కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ...



Credits
Writer(s): Kona Venkat, Shashi Preetam
Lyrics powered by www.musixmatch.com

Link