Etu Choosina

తనంటే నాకు చాల ఇష్టం
తనకూ నేనంటే ఇష్టం
అనుకుంట

ఎటు చూసిన ఉన్నది నువ్వే కదా
చెలి ఆ నువ్వే నాకిక అన్నీ కదా
ఎగురుతున్నాదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా
నువ్వే లేనిదే ఏమీ తోచదే
నిన్నే తలవనీ రోజే ఉండదే

సెలయేరు చేసే గలగల సవ్వడి వింటే
నీ పిలుపే అనుకుంటా
(నీ పిలుపే అనుకుంటా)
చిరుగాలి తాకీ గిలిగింతలు పెడుతుంటే
నువ్వొచ్చావనుకుంటా
(నువ్వొచ్చావనుకుంటా)
మైమరపేదో కమ్మిందో ఏమో
నా మనసుకి కదలిక నీవల్లనే
నా కనులకి కలలూ నీవల్లనే
ఎగురుతున్నాదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా

వెలుగుల్ని పంచే మిణుగురు పురుగుల పైనా, నీ పేరే రాశాలే
(నీ పేరే రాశాలే)
నువ్వొచ్చే దారుల్లో నవ్వుల పువ్వులు పోసీ, నీ కోసం చూశానే
(నీ కోసం చూశానే)
చెలియా ఎప్పుడు వస్తావో ఏమో

నా చెరగని గురుతువి నువ్వే కదా
నా తరగని సంపద నువ్వే కదా
ఎగురుతున్నాదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా



Credits
Writer(s): Bhaskara Bhatla, Kenny Abhiman
Lyrics powered by www.musixmatch.com

Link