Nuvvu Sara Taguta

నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న
నువ్వు బీరు తాగుట మానురన్నో లేకుంటే బాల్చి తన్నేస్తావురన్న
అరె బ్రాందీ, whiskey, రమ్ము ఏ brand-u తాగినా
బ్రాందీ, whiskey, రమ్ము ఏ brand-u తాగినా
జబ్బు పడి నీ ఒళ్ళు గబ్బు గబ్బౌతాది
నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న
(ఏ యాది ఇంటున్నవా)
ఆ' తాగిన ముందు తలకెక్కెనంటే తల్లి చెల్లెనే ఆలంటావన్న
మత్తు నలగలోకెగబాకినంక కత్తి కోతకే పని పెడతావన్న
అరె బుర్రలో సైతాను గిర్రున తిరిగితే (తిరగితే)
ఊ' బుర్రలో సైతాను గిర్రున తిరిగితే బర్రా బర్రా నాల్గు ముర్డర్లు చేస్తావే
(ఏం లింగం సమజైతుందా)
నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న
ఆ' ముందు గొంతులో దిగబడ్డాదంటే
ఒంటిలో ఉన్న నీ రక్తమంతా కంటిలోకొచ్చి చేరుకోగానే
అరె కంటి కింది తోలు దిబ్బలాగా ఉబ్బి
ఓయ్ కంటి కింది తోలు దిబ్బలాగా ఉబ్బి
నంజురోగం వచ్చి గుంజుకొని పోతావే
(నంజురోగమా అదేంట్రా)
(ముందు ముందు ఎరకైతది పో)
నువ్వు సారా తాగుట మాను లింగం లేకుంటే సచ్చి ఊర్కుంటావు లింగం
(ఆగ ఆగరా ఇంకేమవుతుందో చెప్పరా)
నీ లీవరు లీకైతదన్న, నీ హార్టు హైజాక్ అయితదన్న
నీ kidney kidnap అయితదన్నో, నీ bladder-u బ్లాక్ అయితదన్న
అన్నీ పోయినాక ఎన్ని మందులు తిన్నా (ఏం లింగం ఓయ్)
అన్నీ పోయినాక ఎన్ని మందులు తిన్నా
ఆఖరికి నీ బతుకు టీడింగు డింగన్న



Credits
Writer(s): Ramana Gogula, Masterji
Lyrics powered by www.musixmatch.com

Link