Gali Chiru Gali

గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మ
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మ
రూపమే ఉండని ఊపిరే నువ్వని
ఎన్నడు ఆగని పయనమే నీదని
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మ
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మ

కనురెప్ప మూసివున్నా నిదరొప్పుకోను అన్నా
నిను నిలువరించేనా ఓ స్వప్నమా
అమవాస్యలెన్నెయినా గ్రహణాలు ఏవైనా
నీ కళను దోచేనా ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ పోల్చదు నేలమ్మ
ఉలి గాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మ
మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చీకటే దారిగా వేకువే చేరగా
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మ
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మ

చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా నీ రాక ఆపేనా వాసంతమా
ఏ కొండరాళ్ళైనా ఏ కోన ముళ్ళైన బెదిరేన నీ వాన ఆషాఢమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా
సాగిపో నేస్తమా నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా
పోరిమే సాక్షిగా ఓటమే ఓడగా
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మ
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మ
రూపమే ఉండని ఊపిరే నువ్వని
ఎన్నడు ఆగని పయనమే నీదని



Credits
Writer(s): S. A. Raj Kumar, S. A. Raj Kumar & Sirivennela Sitarama Sastry, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link