Vana Vana

వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
కురవని కురవని నె నిలువునా కరగనీ
పాప కంటి చూపులలొ పాల పంటి నవ్వులలొ
బాల మేఘ మాలికలొ జాలువారు తొలకరిలొ
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోని
తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ
చిరు చిరు పలుకుల చినుకులలొ
బిర బిర పరుగుల వరదలలొ
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోని
వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా

ముంగిట్లొ మబ్బే వచ్చె మనసులోన మెరుపొచ్చె
పన్నీటి చినుకే వచ్చె ప్రానంలోన చిగురొచ్చె
బుల్లి బుజ్జి వాన దేవతొచ్చె
గుండె పైన నీల్లు చల్లి లాల పోసె నేడె
ఘల్లు ఘల్లు గాలి దేవతొచ్చె
జీవితాన ప్రేమ జల్లి లలి పాట పాడె
ఒహో... స్రావనలా రాని వచ్చె
వున్న చీకు చింత చీకట్లన్నీ కడిగె
ఇంకా ఇంకా ఏం కావలొ అడిగె
మధురంగ కధె సాగుతుంటె
మన బెంగ ఇలా కరుగుతుంటె
వేగంగ కలే తీరుతుంటె
ఆ గంగ ఇలకు జరుతుంటె
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోని

చిన్నతనం ముందరికొచ్చె పెద్దరికం మరుపొచ్చె
ఏటిగట్టు ఎదురుగ వచ్చె ఇసుక గుల్లు గురుతొచ్చె
కారు మబ్బు నీరు చిందుతుంటె
కాగితాల పడవలెన్నొ కంటి ముందుకొచ్చె
నీటిలోన ఆటలడుతుంటె అమ్మనోటి తీపి తిట్లు గ్న్యాపాకనికొచ్చె
ఒహో... పైట కొంగె గొడుగు కాగా
ఈ చోటు చోటు ఎంతో ఎంతో ఇరుకై
ఏమైందంటె నీకు నాకు ఎరుకె
ఒక్కటిగా ఇలా పక్కనుంటు ఇద్దరమై సదా సర్దుకుంటు
ముగ్గురిదీ ఒకె ప్రానమంటు ముద్దులతొ కధె రాసుకుంటు
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోని

వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
కురవని కురవని నె నిలువునా కరగనీ
పాప కంటి చూపులలొ పాల పంటి నవ్వులలొ
బాల మేఘ మాలికలొ జాలువారు తొలకరిలొ
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోని
తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ



Credits
Writer(s): Chandrabose, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link