Manasu Manasu

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
ఇల్లే స్వర్గమాయే, ఎదజల్లే మూగ ప్రేమల్లోన
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే

కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే
మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే
ఊరువాడ ఉయ్యాలూగే, హుషారంతా మాదేలే
నింగినేల తాళాలేసే, సరాగాలు మాకేలే
తాతే మనవడాయే, నానమ్మే మనువు ఆడేవేళ
అరవై ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్ళి
మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు
ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం
నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం

అరగని అరుగులు అలికిన వేళ అతిథులకాహ్వానం
తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం
ఈడు జోడు ఆడేపాడే పదాలన్నీ మావేలే
ఏకమైన మా గుండెల్లో, శ్రుతి లయ ప్రేమేలే
వీర రాఘవయ్య, నీ పేరే నిలుపుకుంటామయ్యా
ఇల్లు ఇల్లు ఏకమైన పండగీనాడే
మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
ఇల్లే స్వర్గమాయే, ఎదజల్లే మూగ ప్రేమల్లోన
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే



Credits
Writer(s): Veturi, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link