Devatalaaraa

దేవతలారా రండి మీ దీవెనలందించండీ
నోచిన నోములు పండించే
నా తోడును పంపించండీ
కలలో ఇలలో ఏ కన్యకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండీ
కనీవినీ ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండీ
కలలో ఇలలో ఏ కన్యకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండీ
కనీవినీ ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండీ

శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి

ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి
శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి
మా ముంగిలిలోన పున్నమి పూలవెన్నెల విరియాలి
మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి

కలలో ఇలలో ఏ కన్యకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండీ
కనీవినీ ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండీ

తన యదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు

తన ఇంటికి కళతెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు
తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు
ఈ పుత్తడిబొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోట
నిధినిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట

కలలో ఇలలో ఏ కన్యకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండీ
కనీవినీ ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండీ

దేవతలారా రండి మీ దీవెనలందించండీ
నోచిన నోములు పండించే
నా తోడును పంపించండీ
కలలో ఇలలో ఏ కన్యకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండీ
కనీవినీ ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండీ



Credits
Writer(s): Sitaram Sastry, S.v. Krishna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link