Yemainado (From "Mr. Majnu")

ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో

చుక్కలే మాయమైన నింగి లాగ
చినుకులే కురవలేని మబ్బు లాగ
ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో

ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో

వివరమంటు లేని వింత వేధనా
ఎవరితోటి చెప్పలేని యాతనా
తలను వంచి తప్పుకెళ్లు తప్పే చేశానా
ఎంత మంది వచ్చి వెళ్లి పోయినా
నవ్వులేక వేడుకోలు అంచున
ఇంత గుచ్చలేదు నన్ను ఏ పరిచయమైనా
ఓ నీకు నచ్చినట్టు నేనుంటున్నా
ఎందుకంటే చెప్పలేనంటున్నా
అర్ధమవదు నాకు ఇంతగా మారెనా
కాలమే, కదలనన్న క్షణము లాగ
ఎన్నడూ (ఎన్నడూ)
తిరగరాని నిన్నలాగ

ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో



Credits
Writer(s): Srimani, Thaman S
Lyrics powered by www.musixmatch.com

Link