Rang de

నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ
నిదుర మరచినా రెప్పల జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు
బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం
(రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే)
(రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
(రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ
నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం

నీలిమేఘం, నెమలి పింఛం
రెంటికీ లేదు ఏమంత దూరం
ఒకటి హృదయం, ఒకటి ప్రాణం
వాటినేనాడు విడదీయలేం
(హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ

రామ బాణం సీత ప్రాణం
జన్మలెన్నైన నీతో ప్రయాణం
రాధ ప్రాయం మురళి గేయం
జంట నువ్వుంటే బృందావనం
(హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
(హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ



Credits
Writer(s): Shankar Mahadevan, Ehsaan Noorani, Aloysuis Peter Mendonsa, Niranjan Kannan Iyengar
Lyrics powered by www.musixmatch.com

Link