Raa Mundadugeddam

నీకు తెలియనిదా నేస్తమా
చెంత చేరననే పంతమా
నువు నేనని విడిగా లేమని
ఈ నా శ్వాసని నిను నమ్మిన్చని

విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా
ఉండుంటే అది మనిషిది ఐ ఉంటుందా
అడిగావా భుగోలమా
నువ్వు చూసావా ఓ కాలమా
రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన
ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా
రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం
రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం
సాదిందేముంది ఈ వ్యర్ధ విరోధం
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం
రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం
మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం
ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం
నీకు తెలియనిదా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం
చెంత చేరననే పంతమా
ఖండాలుగ విడదీసే జండాలన్ని
తలవంచే తలపే అవుదాం
ఆ తలపే మన గెలుపని అందాం



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Chirrantan Bhatt
Lyrics powered by www.musixmatch.com

Link