Karuna Kuriyu

కరుణ కురియు అరుణాచల శివశంభో
జయ జయ శంభో
కడుపుతీపి రుచి తెలిసిన
హరశంభో కైలాస విభో
జన్మని ధన్యం చేయవయా
వరపుత్రుని ఒసగి ప్రేమతో దీవెనలీయవయ్యా
కరుణ కురియు అరుణాచల శివశంభో
జయ జయ శంభో
కడుపు తీపి రుచి తెలిసిన
హరశంభో కైలాస విభో
రాహు కేతు శని నాగ దోషములు
నివారించు నిఖిలేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
అమ్మ నా పిలుపుతో అమృతత్వమును
ప్రసాదించు పరమేశ్వరా
ఈశ్వరా పరమేశ ఈశ్వరా పరమేశ్వరా
బాల గణపతి కుమారస్వాముల
ఆటలు చూసి మురిసే దేవా
శివ శివ శంకర హర హర దేవ
పాలు తేనె అభిషేకములను గొని
పరీక్షించకిక దయగనరారా
అభయమునీరా పాహి పాహి దేవా
సంతాన భాగ్యమీరా
తల్లి ప్రేమల తండ్రి మమతల
వెల్లువైన నీ చూపులే
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
వంశ దీపమై ఇల్లుచేరి
వర్ధిల్లెనయ్య విశ్వేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
పిలిచినంతనే పలికి భక్తులకు
వరములనోసగే అరుణగిరీశా
నమక చమకములు మనసా వాచా
మరిమరి మరి కొలిచెద ఉమామహేశా
ధన్య మాయే నా బ్రతుకే
దాసోహం ఇక నీకే
జన్మని ధన్యం చేయవయా

ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా
ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా



Credits
Writer(s): S.a. Rajkumar, Jonnavithula Ramalingeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link