Vana Vana

వయసేమో పదహారు పరుగెత్తే సెలయేరు
పరువాల సిత్రాలు పడుసోళ్ళ ఆత్రాలు
నిదరోయే నేత్రాలు నిలువెల్లా గాత్రాలు
మతిపోయే అందాలు శతకోటి దండాలు

వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగినేల హరివిల్లై కలుపుదామిలా
మబ్బుల్లో హంసలాగ మల్లెల్లో మంచులాగ
కన్నుల్లో సిగ్గులాగ వెన్నెల్లో ముగ్గులాగ
దోసిట్లో చినుకులాగ వాకిట్లో తులసిలాగ
వరిచేను గువ్వలాగ పెదవుల్లో నవ్వులాగ (లాగ, లాగ, లాగ, లాగ)

మనమంతా గంతులాడుదాం
సిరిమువ్వై చిందులాడుదాం
సరదాగా ఆటలాడుదాం
పరువాల పాట పాడుదాం

వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగినేల హరివిల్లై కలుపుదామిలా

ఓహోహో తయ్యర తయ్య తయ్యారె తయ్యారె
తయ్యర తయ్య తయ్యారె తయ్యారె

అహ తుళ్ళిపడే ఈడులో తుమ్మచెట్టు నీడలో
చెమ్మచెక్క ఆటలాడుదాం
పొద్దుపొడుపు వేళలో అత్తమడుగు వాగులో
ఆదమరిచి ఈదు లాడుదాం
పక్కింటిలోన కుర్రాడ్ని కదుపుదామా

పక్కింటిలోన కుర్రాడ్ని కదుపుదామా
మాటలతో మాయచేసి కథకాలి ఆడిద్దామా
గుండ్రంగా తిప్పిద్దామా, గుంజీలే తీయిద్దామా
గుండ్రంగా తిప్పిద్దామా, గుంజీలే తీయిద్దామా

వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగినేల హరివిల్లై కలుపుదామిలా

గడ్డివాము చాటుగా లంకచుట్ట ఘాటుగా
గుప్పు గుప్పుమంటు లాగుదాం
ఊరు పెద్ద గుట్టుగా రంగితోటి పచ్చిగా
కులుకుతున్న మాట చాటుదాం
కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా
డింకి టకరి డింక హే డింకి టక
కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా
వీధుల్లో చేరి మనం వసంతాలు ఆడేద్దామా
వయ్యారం వలికిద్దామా, సంగీతం పలికిద్దామా
వయ్యారం వలికిద్దామా, సంగీతం పలికిద్దామా

వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగినేల హరివిల్లై కలుపుదామిలా
మబ్బుల్లో హంసలాగ మల్లెల్లో మంచులాగ
కన్నుల్లో సిగ్గులాగ వెన్నెల్లో ముగ్గులాగ
దోసిట్లో చినుకులాగ వాకిట్లో తులసిలాగ
వరిచేను గువ్వలాగ పెదవుల్లో నవ్వులాగ (లాగ, లాగ, లాగ, లాగ)

మనమంతా గంతులాడుదాం
సిరిమువ్వై చిందులాడుదాం
సరదాగా ఆటలాడుదాం
పరువాల పాట పాడుదాం



Credits
Writer(s): Kula Sekhar, Dina
Lyrics powered by www.musixmatch.com

Link