Bangarubomma Rave

ఓం ఆపో హిష్ఠా మయోభువః
తాన ఊర్జే దధాతన
మహేరణాయ చక్షసే
యోవః శివతమో రసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మా అరంగ మామ వః
యస్య క్షయాయ జిన్వథ
ఆపో జనయథాచనః

బంగారు బొమ్మరావే
పందిట్లో పెళ్లి నేడే
ఇక లేవులే రణాలు
ఎటుచూడు తోరణాలు
కక్షలు ఇంకా లేనేలేవమ్మా
అక్షింతలును కలపండోయమ్మా
కళ్ళల్లోన కన్నీరేంటమ్మా
చెల్లెలుకిచ్చే కట్నం లేదమ్మా

బంగారు బొమ్మరావే
పందిట్లో పెళ్లి నేడే

పెన్నా సాక్షి మన పెళ్లిపీట వేసింది చిన్నిప్రేమా
ఈ సూర్యచంద్రులను బావమరుదులుగా చూసి మురిసె సీమా

Bomb-uలు నేడు తాంబూలాలై సంకల్పాలే సుముహూర్తాలై
మెల్లంగా కొంటె వరుడు ఉంగరాలు మార్చు వేళ
గిల్లగా ఈ పిల్లకు అణువణువున ఆనందం
గుడు గుడు గుంచం గుండెల్లో రాగం
డుం డుం బాజా సన్నాయి మేళం
(గుడు గుడు గుంచం గుండెల్లో రాగం
డుం డుం బాజా సన్నాయి మేళం)

బంగారు బొమ్మరావే
పందిట్లో పెళ్లి నేడే

ఎదురు పడితే తొడ చరిసి పగతో ఉరిమురిమి చూసెవాళ్ళు
ఈ రోజు పెళ్లి మండపము ముందు బంధువులు అయ్యినారు

పసుపు రాసిన మూరెడు తాడు ఒక్కటి చేసే పల్లెలు నేడూ
మీ గుండెల్లోన ఉంది రాల్లనైన నీరు చేసే త్యాగము అనురాగము ఇక ప్రేమే అనుబంధం
ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా
రాయలసీమ పుట్టిల్లేనమ్మా
(ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా
రాయలసీమ పుట్టిల్లేనమ్మా)

బంగారు బొమ్మరావే
పందిట్లో పెళ్లి నేడే
ఇక లేవులే రణాలు
ఎటుచూడు తోరణాలు



Credits
Writer(s): Vandemataram Srinivas, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link