Chamanthi Puvva Puvva

చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతిపూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా

ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాలబుగ్గ
అదిరిందిరయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా

చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతిపూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా

సిరిమల్లె మాల సిగలో ముడిచెయ్నా
చెంగావి చీర సిగ్గే దోచెయ్నా
అడిగిందే చాలు గురుడా పెనవెయ్నా
కౌగిట్లో చేరి కళలే కలబోయనా
సుడి రేగుతుందే సుఖమైన జ్వాల
మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో
అబ్బాయి నాట్యమాడేస్తుంటే...
అర్రెర్రెర్రెర్రే' గిచ్చనా గొల్లభామ ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమ

జిగిజిగిచ జిగిజిగిచ జిగిచ
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతిపూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా

సంపంగి మొగ్గ శృతిలో సవరించు
అందాల బొమ్మ ఇదిగో అలరించు
శృంగార వీణ సఖియా పలకించు
వయ్యారమంతా ఒడిలో ఒలికించు
మరుమల్లె వేళ మదనాల గోల

పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో
అమ్మాయి నన్ను దాచేస్తుంటే... హహహహా
హత్తుకో అందగాడా మజాలే అందుకో చందురుడా

జిగిజిగిచ జిగిజిగిచ జిగిచ
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతిపూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా

ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాలబుగ్గ
అదిరిందిరయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
అర్రె' పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా



Credits
Writer(s): Vidyasagar, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link