Naake Ne Nachesthunna

నాకే నే నచ్చేస్తున్నా
నాకే నే ముద్దొస్తున్నా
నువ్వంటూ నాలోకొచ్చి చేరాక
నన్నే నే గిచ్చేస్తున్నా
నీ వైపే వచ్చేస్తున్నా
నా మనసు నడిపిస్తున్న నీ దాకా
ఇంకో జన్మల్లె అనిపిస్తోంది సంతోషం
ప్రేమే నీ లాగ ఎదురైంది నా కోసం
అడిగానని అనుకోకు రా
నను నిలుపుకో నీ సరసన
నాకే నే నచ్చేస్తున్నా
నాకే నే ముద్దొస్తున్నా
నువ్వంటూ నాలోకొచ్చి చేరాక

(స స స సగమప స స స)
(గమగస స స స)
(సగమప స స స సగమప గమపని)

చెక్కిళ్ళలో మందారలై పరుచుకున్నది బృందావనం
ఎక్కిళ్ళలో రాధమ్మనా తలచుకున్నది నిన్ను నా యవ్వనం
అన్ని భావాలు మాటల్లోన తేలేను
అర్ధమయ్యేలా నీతో చెప్పుకోలేను
నువ్వే తెలుసుకో, జత కలుసుకో
నిన్ను కలవరించే కలలను
నాకే నే నచ్చేస్తున్నా
నాకే నే ముద్దొస్తున్నా
నువ్వంటూ నాలోకొచ్చి చేరాక

(తుమ్మెద ఝుం ఝుం తుమ్మెద)
(ఈ నల్లనివాడింత అల్లరివాడే తుమ్మెద)
(తుమ్మెద ఝుం ఝుం తుమ్మెద)
(నిండు నీలాల కన్నుల్లో నిద్దర్లు దోచాడే తుమ్మెద)
(మీసాలు గుచ్చాడే తుమ్మెద)
(ముద్దు మోసాలు చేసాడే తుమ్మెద)
(వాటేసుకున్నాడే తుమ్మెద)
(వేడి వడ్డాణం ఇచాడే తుమ్మెద)
(తుమ్మెద ఝుం ఝుం తుమ్మెద)
(నిండు నీలాల కన్నుల్లో నిద్దర్లు దోచాడే తుమ్మెద)



Credits
Writer(s): Ramajogayya Sastry, Sai Kartheek
Lyrics powered by www.musixmatch.com

Link