Pasidi Pallelona

పసిడి పల్లెల్లోన పచ్చదనాల ఆనందం
మరకంటని మనసుల్లోన చిగురే తొడిగెను ఈ తరుణం
నీచాన్ని శాసించే మా ఊరి దొర వీడే
కర్కశ రాజ్యాన్ని ఏలే రక్షక రాజు వీడేలే
పంటచేలు పైరా గాలికి ప్రాణ వాయువు అయ్యేవే
మా కళ్ళు మురిసే ఆశలు ఎగిసే
చిరునవ్వుల మాసం మాదేలే
నీలి వర్ణాల రంగుల నవ్వులే
నింపేనంట మా ఇంటింటా ఇవ్వాళే
మొలకెత్తేనే మా ఆకలి ఆశలే
మొదలాయేనే మా పండగ పబ్బాలే

బంధువల్లే బలరాముడల్లే
మా గుండెకు అండగా నిలిచాడే
రైతు గెలిచే రాజుల నిలిచే
ఇక సందడి సవ్వాళే సాగేనే
కరువులే మాయం
సాగించరా సేద్యం
సుసాధ్యమే హరితర రాజ్యం
మా నేలమ్మా చిమ్మే
బంగారాలే పండే
కేరింతల రాగాలు మావెలే

అనుబంధాల మీ ప్రేమందాలే
దాగున్నవి సీమల నెలలో
కలలే పండే ధాన్యాలే నిండే
సిరి హంగుల రంగులే మా పల్లెలో
పంటచేలు పైరా గాలికి ప్రాణ వాయువు అయ్యేవే
మా కళ్ళు మురిసే మా ఆశలు ఎగిసే
చిరునవ్వుల మాసం మాదేలే
నీలి వర్ణాల రంగుల నవ్వులే
నింపేనంట మా ఇంటింటా ఇవ్వాళే
మొలకెత్తేనే మా ఆకలి ఆశలే
మొదలాయేనే మా పండగ పబ్బాలే



Credits
Writer(s): Sai Kartheek, Santhosh Sakhe
Lyrics powered by www.musixmatch.com

Link