Hamsa Naava

ఓరోరి రాజా
వీరాధి వీరా
ఓరోరి రాజా వీరాధి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంస-నావలోన
నీ గాలి సోకుతుంటె పైన
మెచ్చిందిలే దేవసేన

నేన్నీ ఎదపై విశాల వీరభూమిపై వసించనా
నేనే వలపై వరాల మాలికై వాలనా
నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా
నిన్నే గెలిచే సుఖాల ఖేళిలో తేలనా
ఓహొహో ఓహొహో ఏకాంత కాంత మందిరాన
ఓహొహో ఓహొహో నీ మోహ బాహుబంధనాన
నూరేళ్ళు బంధీని కానా

ఓరోరి రాజా
ఓరోరి రాజా వీరాధి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంస నావలోన

నీ గాలి సోకుతుంటె పైన
మెచ్చిందిలే దేవసేన



Credits
Writer(s): Chitanya Prasad, M. M. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link