Suryudne Chusoddhama

సూర్యుడ్నే చూసొద్దామా నువ్వు నేను
నీరే కొంచం పోసెయ్య
చంద్రుడ్నే తాక్కొద్దామా
వెన్నల్నే మొత్తం కోసి లోకం మొత్తం పంచేద్దాం
గాలుల్లో తేలనీ
ఆకాశం అందనీ

మేఘాలే పట్టి పొరిలించి వానల్లె చేద్దాం
నేలంతా ప్రేమే పండిద్దాం
చుక్కల్ని తెంపి విత్తల్లె నాటేసి చూద్దాం
తారల్లె మొత్తం నేలంతా పోయిద్దాం

నదిలోన కడవల్లె మునగాలి తడవాలి
ప్రతిరోజు ఒక ఆట గుర్తుండేలా ఆడెయ్యాలి
చేజారి చెడకుండా నిమిషాలే గడపాలి
బ్రతుకంటే భయమంటూ ఆలోచించే ముందే నువు మారాలి
ఓ ఓ ఓ నీ తోడే నీవే ఓ ఓ ఏదో చేసెయ్
చిందేసే ఈడే కదా అందర్లో చిందెయ్యాలి
సిగ్గంటు ఓ మాటంటే లైఫే కాదే
నవ్వాలి నవ్వించాలి
స్నేహాలే పూయించాలి
ఈ ఈడె పోతే మళ్ళీ రాదే
ఇంతేలే జీవితం
ఇంతేలే జీవితం

మేఘాలే పట్టి పొరిలించి వానల్లె చేద్దాం
నేలంతా ప్రేమే పండిద్దాం
చుక్కల్ని తెంపి విత్తల్లె నాటేసి చూద్దాం
తారల్లె మొత్తం నేలంతా పోయిద్దాం



Credits
Writer(s): Vasu Valaboju, Sunny Mr
Lyrics powered by www.musixmatch.com

Link