Naa Chinni Thalli

ఓ... నా చిన్ని తల్లి చూడవే
నా చిట్టి తల్లి చూడవే
నా బుజ్జి కన్నా ఓ సారైనా కళ్ళే విప్పి చూడవే
నా బంగారు మాటాడవే
నీ నోరారా మాటాడవే
నీ మాటల్లోని ముత్యాలన్నీ ఏరేలా మాటాడవే
ఆటలాడే లేత ప్రాయంలో
అందరినొదిలి వెళుతూ ఉన్నావే

చిందేసే అడుగులిక ఆగేనే
చుట్టేసే చేతులిక నేడు అలసేనే
రమ్మని దేవుడే పిలిచెనే
కలల కన్నులు కాలి బూడిదైనే
అందాల చక్కిళ్ళు అగ్గి పాలైయెనే
అమ్మకే కడుపులో కదిలెనే
నీ ఆట బొమ్మల గుండె పగిలెనే పగిలెనే
నీ చిట్టి నేస్తాలు నిన్నే వెతికెనే
నిను చూసి కన్నీరే ఏరై పారేనే

నా చిన్ని తల్లి చూడవే
నా చిట్టి తల్లి చూడవే
నా బుజ్జి కన్నా ఓ సారైనా కళ్ళే విప్పి చూడవే
నా బంగారు మాటాడవే
నీ నోరారా మాటాడవే
నీ మాటల్లోని ముత్యాలన్నీ ఏరేలా మాటాడవే
ఆటలాడే లేత ప్రాయంలో
అందరినొదిలి వెళుతూ ఉన్నావే



Credits
Writer(s): M Ghibran, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link