Evaree Ammayee Ani

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానే నా ప్రాణం అని తెలిసే ఈనాడు
నన్నే చూసెనే, ఏదో అడిగెనే
మాయే చేసెనే ఓ ఓ ఓ
చూపుతో నవ్వెనే చూపులు రువ్వెనే
గుండె గిల్లెనే ఓ ఓ ఓ
చుక్కల్లో నడుమ జాబిల్లి తానే
రెక్కలు తొడిగే సిరిమల్లి తానే
ఏదో చేసే నన్నే
ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానే నా ప్రాణం అని తెలిసే ఈనాడు

మా ఇంటి ముంగిట్లో తను వేసే ముగ్గులు
ఎప్పటికీ చెరిగి పోరాదంట
తన పెదవుల మందారం
తన పాపిట సింధూరం
నా గుండెకి సూర్యోదయమంట
అందాల గాజుల లాగా
తన చేయి స్పర్శ తగిలితే చాలు
తన కాలి మువ్వ సవ్వడి నేనై
కలకాలముంటే మేలు
కమ్మని చెవిలో కబురే చెప్పెనే
సిగ్గునే బుగ్గ మొగ్గే నిమిరెనే
ఏదో చేసే నన్నే
ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానే నా ప్రాణం అని తెలిసే ఈనాడు

నే తనని చూస్తే ఎటో చూస్తుంది
నే చూడకుంటే నన్నే చూసే
తన నవ్వు చూపి, నే చూస్తే ఆపి
పైపైకి నటనేదో చేసే
స్త్రీ హృదయం అద్వైతం లాగా
ఏనాడు ఎవరికర్థమే కాదు
మగవాడి మనసూ తపియించే వయసు
ఆడవాళ్ళకి అలుసు
మది గాయపడ్డాక నాకోసం వస్తుంది
వానే వెలిసాక గొడుగిచ్చి వెళ్తుంది
ఏదో చేసే నన్నే
ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానే నా ప్రాణం అని తెలిసే ఈనాడు
నన్నే చూసెనే, ఏదో అడిగెనే
మాయే చేసెనే ఓ ఓ ఓ
చూపుతో నవ్వెనే చూపులు రువ్వెనే
గుండె గిల్లెనే ఓ ఓ ఓ
చుక్కల్లో నడుమ జాబిల్లి తానే
రెక్కలు తొడిగే సిరిమల్లి తానే
ఏదో చేసే నన్నే



Credits
Writer(s): Vennelakanti, Yuvan Shankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link