Chey Savaari - Telugu

ఉదయించే సూర్యుడే నిదరంటూ మానడే
నడిరేయే దాటుతూ కిరణంలా సవారి

ఎగసేటి సంద్రమే అలుపంటూ ఆపదే
దరిదాకా సాగుతూ కెరటాల సవారి
చీకట్లే చీల్చుకుంటూ, సంకెళ్ళే తెంచుకుంటూ
తాకాలోయ్ నింగి అంచు
పడి పడి తలపడి నిలబడగా
నువ్వు సవారి చెయ్ సవారి
చెయ్ సవారి
చెయ్ సవారి
పాదాలే రెక్కలవ్వాలే
నీలి నింగైనా చేతికందాలే
సవారి చెయ్ సవారి
చెయ్ సవారి
చెయ్ సవారి
దిక్కులే ధిక్కరించాలే
చుక్కలెన్నున్నా తెంచి తేవాలే

భూగోళాన్నే తిరగకని ఆపగలిగేది ఎవరసలు
నీలి మేఘాన్నే కురవకని ఆజ్ఞ వేసినా ఆగదులే
పలువురు చెప్పే మాట వినుకోకు
నలుగురు వెళ్ళే దారికెళ్ళిపోకు
ఎవరికీ నువ్వు బంటువనుకోకు
జగతికి నువ్వు రాజువనుకుంటూ
సవారి చెయ్ సవారి
చెయ్ సవారి
చెయ్ సవారి
పాదాలే రెక్కలవ్వాలే
నీలి నింగైనా చేతికందాలే
సవారి చెయ్ సవారి
చెయ్ సవారి
చెయ్ సవారి
దిక్కులే ధిక్కరించాలే
చుక్కలెన్నున్నా తెంచి తేవాలే

గమ్యం నీకై నడవదులే
దూరమెంతైన తరగదులే
కంట నీరుకే కరగదులే
జాలి లేదులే ఓటమికే
మొదలవకుండా పూర్తి అవదంటూ
అడుగుకు ముందు తప్పటడుగంటూ
మలుపులు కూడా స్ఫూర్తి అనుకుంటూ
యుద్ధం చేసే సైన్యం లాగా
సవారి చెయ్ సవారి
చెయ్ సవారి
చెయ్ సవారి
పాదాలే రెక్కలవ్వాలే
నీలి నింగైనా చేతికందాలే
సవారి చెయ్ సవారి
చెయ్ సవారి
చెయ్ సవారి
దిక్కులే ధిక్కరించాలే
చుక్కలెన్నున్నా తెంచి తేవాలే



Credits
Writer(s): Shekar Chandra, Ramanjaneyulu
Lyrics powered by www.musixmatch.com

Link