Mounama O Mounama

మౌనమా ఓ మౌనమా
మాట లేదుగా
పాదమా ఓ పాదమా
బాట లేదుగా
తోలి ప్రేమలో నీ ఆటలో
గెలిచావు నీవు హాయిగా
ఆ ప్రేమ లేని చోటులో
నిలిచావు నేడు రాయిలా

గుండె చప్పుడు ఆగిపోతుందే
కంటి నీరు పొంగి పోతుందే
కాలం ఇంత మారిపోతుందే
పారిపోతుందే చేజారి పోతుందే
ఆశ ఆవిరై పోతుందే
శ్వాస భారమైపోతుందే
ప్రేమ మాయమై పోతుందే
పారిపోతుందే చేజారి పోతుందే

వెలుగులలో నువ్వు మునకేసి
చీకటి తీరం చేరావే
చిరునవ్వే నువ్వు ఉరి తీసి
బాధకు ఊపిరి పోసావే
సరదా సరదా స్వేచ్ఛను తెంచి
సంకెలలాగా మార్చావే
జతగా బతికే బదులే వెతికి
జవాబు లెన్నటి ప్రశ్నల్లె మిగిలావే

గుండె చప్పుడు ఆగిపోతుందే
కంటి నీరు పొంగి పోతుందే
కాలం ఇంత మారిపోతుందే
పారిపోతుందే చేజారి పోతుందే
తప్పు ఉప్పెనై పోతుందే
ప్రేమ కప్పుకేల్లి పోతుందే
తలకిందులై పోతుందే
ఆరిపోతుంది తెల్లారి పోతుందే

నేరమనేది నీది కదా
సిక్ష పడేది అందరికా
తప్పు అనేది నీది కదా
నొప్పి అనేది అందరికా
మూడే ముళ్ళు ప్రేమే కోరగ
మూడు ముళ్ళులతో గుచ్చావే
ఏడడుగులుగా ప్రేమను మార్చగ
ప్రేమన్న పదానికి అర్ధాన్ని మార్చావే

గుండె చప్పుడు ఆగిపోతుందే
కంటి నీరు పొంగి పోతుందే
కాలం ఇంత మారిపోతుందే
పారిపోతుందే చేజారి పోతుందే
చిక్కు పెద్దదై పోతుందే
దిక్కు తోచకుండా పోతుందే
లెక్క నేడు మారిపోతుందే
తేరిపోతుందే చేజారి పోతుందే



Credits
Writer(s): Shekhar Chandra, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link