Nalage Anni Nalage

నాలాగే అన్నీ నాలాగే
నా చిన్ని కన్నా చూస్తున్నా నిన్ను నాలోన
చినుకల్లే నువ్వే ఉంటే అది నాకు చాలనుకుంటే
సంద్రంలా నువ్వే పొంగవా

నాలాగే అన్నీ నాలాగే
నా చిన్ని కన్నా చూస్తున్నా నిన్ను నాలోన
చినుకల్లే నువ్వే ఉంటే అది నాకు చాలనుకుంటే
సంద్రంలా నువ్వే పొంగవా

మెల్లగా మెల మెల్లగా తొలి అడుగులేసిన ప్రాయం
నేటికి నే మరవలే ఇంతలోనే ఎంతటి గాయం
వెలుగుకా అది వెనకకా ఎటువైపుకో నీ వేగం
ఎన్నడూ నే నేర్పలేదే నీకు ఇంతటి త్యాగం
పూవయ్యావు ముల్లవుతున్నావో
గురుతించలేక ఉన్నాను చెట్టు కొమ్మోలే
నిన్నైతే కన్న నేను నీ రాతను కనుగొనలేను
ఏ తీరం నీ కధ చేరేనో

నిద్దరే అసలోద్దనే నిత్య పొద్దు పొడుపే నీవు
నల్లని ఆ మబ్బులే కమ్మేయగలవా నిన్ను
అమ్మకే ఇక అందని శిఖరాలకెలుతున్నావు
ఈ నేలపై ప్రతి అమ్మకు నువు కొడుకులా ఎదిగావు
పోరాటం నీ నెత్తురులో ఉందా
నా పెంపకంలో ఏదో పొరపాటు జరిగిందా
గర్వంగా ఉన్నా గానీ కన్నా నా భయం నాది
ఎంతయినా కన్న కడుపు ఇది

నాలాగే అన్నీ నాలాగే
నా చిన్ని కన్నా చూస్తున్నా నిన్ను నాలోన
చినుకల్లే నువ్వే ఉంటే అది నాకు చాలనుకుంటే
సంద్రంలా నువ్వే పొంగవా



Credits
Writer(s): Suresh Bobbili
Lyrics powered by www.musixmatch.com

Link