Bullipitta Bujjipitta (From "Chinna Rayudu")

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామ చిలుక ఎట్టా ఉన్నది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామ చిలుక ఎట్టా ఉన్నది
అది ఎవరే ఎవరే తెలిపేది
ఎన్ని నాళ్ళే ఇట్టా గడిచేది
అది ఎవరే ఎవరే తెలిపేది
ఎన్ని నాళ్ళే ఇట్టా గడిచేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామ చిలుక ఎట్టా ఉన్నది

నిన్నే తలుచుకుంటూ, ప్రాణం నిలుపుకుంటూ నీకై నిలిచి ఉంది శ్వాస
కాలం కరుగుతున్నా, శోకం పెరుగుతున్నా, ఏదో జరుగునన్న ఆశ
పూమాల వాడలేదు, పారాణి ఆరలేదు, అయినా లోకం జాలి చూపదే
నీ గుండె చప్పుడింకా నా గుండె చేరలేదు
అయినా అయినా కథ మారదే
కష్టాలన్నీ గాయాలే
అవి కాలం తోటే మానాలే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట చెట్టు మీద పాలపిట్ట
ఊరిలోని గోరు వంక ఎట్టా ఉన్నది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామ చిలుక ఎట్టా ఉన్నది

నువ్వే దేవుడివన్న ఊరే నిందిస్తూవుంటే, చెప్పలేని గుండె కోత
కళ్ళే కలుపుకొని ఎన్నో కలలుగన్న వేళ కాటేసింది బాధ
మురిపాన కట్టుకున్న పొదరిల్లు కూలిపోతే ఎదలో రగిలే మంటలారునా
నూరేళ్ళ పంట ఇట్టా మూన్నాళ్ళ ముచ్చటైతే మామా మామా వ్యధ తీరునా
మళ్ళీ ఎట్టా కలిసేది
నా ప్రాణం ఎట్టా నిలిపేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామ చిలుక ఎట్టా ఉన్నది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట చెట్టు మీద పాలపిట్ట
ఊరిలోని గోరు వంక ఎట్టా ఉన్నది
అది ఎవరే ఎవరే తెలిపేది
ఎన్ని నాళ్ళే ఇట్టా గడిచేది
అది ఎవరే ఎవరే తెలిపేది
నే ఎట్టా ఎట్టా బతికేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామ చిలుక ఎట్టా ఉన్నది



Credits
Writer(s): Ilayaraja, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link