Chandrabose - A Pride of Tollywood

ఒక్కటి రెండు కాదు మూడు నాల్గు కాదు
ఇరవైఅయిదేళ్లుగా ఎన్నెన్ని పాటలు
ఎంత సక్కగా రాసారో, చంద్రబోస్ ఎంత సక్కగా రాసారో

మనసుని ముద్దాడే మృదువైన పాటైనా
ఒంటిని ఆడించే అలలాంటి పాటయినా
ఎంత సక్కగా రాసారో, చంద్రబోస్ ఎంత సక్కగా రాసారో

అమ్మ ప్రేమపై కమ్మనైన పాట ఎంత సక్కగా రాసారో
అమ్మ పాడే ఆ జోలపాటనైనా ఎంత సక్కగా రాసారో
ఇంకో నూరేళ్లు ఇట్టాగే ఇంకెన్ని అద్భుతాలు రాస్తారో

ఒక్కటి రెండు కాదు మూడు నాల్గు కాదు
ఇరవైఅయిదేళ్లుగా ఎన్నెన్ని పాటలు
ఎంత సక్కగా రాసారో, చంద్రబోస్ ఎంత సక్కగా రాసారో

అందాన్ని అయినా ఆనందాన్ని అయినా
మాటల్లో బంధించి మా గుండెల్లోన
ఎంత సక్కగా నాటారో, చంద్రబోస్ ఎంత సక్కగా నాటారో



Credits
Writer(s): G. Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link