Nuvvemo - Telugu

నువ్వేమో రెక్కలు చాచి రివ్వున లేచిన పక్షై పైకి ఎగిరి, పోయావే
నెనేమో మట్టిలో వేర్లు చుట్టుకుపోయిన చెట్టై ఇక్కడనే, ఉన్నానే
కోరుకున్న లోకాలు చూడ ఈకొన నూ విడిచి పోతే ఎలా
కొమ్మలన్నీ శోకాలు తీస్తూ కుంగాయి లోలోపల
ఇక నా లోకము నీ లోకము ఒకటెట్టా అవుతాది
(ఇక నా లోకము నీ లోకము ఒకటెట్టా అవుతాది)

కసిగా కసిరే ఈ ఎండలే

(నీ తలపులుగా ఈతలుగలుగా)
నిసిగా ముసిరే నా గుండె నే
(పగటి కళలు ముగిసేలా)

వెలుగే కరిగి పోయిందిలే
ఉసిరే నలిగి పోయిందిలే
ఆశలన్నీ ఆకులై రాలి మనసే పెళుసై ఇరిగిపోయేలే
మాటలన్నీ గాలి మూటలై పగిలి పోయాయిలే
చేతిలో గీతలు రాతలు మారిపోయే చూడు మాయదారిదారులే

(ఊగే కొమ్మకు సాగే పిట్టకు ఉంటె బంధము పేరేమిటంటా
పూసే పూలకు వీచే గాలికి స్నేహం ఎన్నాలట)

నేనేమో ఎల్లాలు దాటి నచ్చిన దారిన ముందుకు సాగేటి
ఓ దాహం
నువ్వేమో మచ్చలు లేని మబ్బులు పట్టని అద్దంలా మెరిసే
ఓ స్నేహం
తప్పదంటూ నీతోనే ఉండి
నీ మనసునొప్పించలేను మరి
తప్పలేదు తప్పని సరై ఎంచాను ఈ దారిని
నిన్ను నీలాగనే చూడాలని దూరంగా వెళుతున్న



Credits
Writer(s): Bijibal, Rehman
Lyrics powered by www.musixmatch.com

Link