Mellaga Mella (From "Chanakya Sapadham")

మెల్లగా మెల్లగా
అల్లుకో అల్లుకో
మెత్తగా మెత్తగా
హత్తుకో హత్తుకో
అల్లుకుంటూ అందమంతా గిల్లుకోనా
హత్తుకుంటూ హాయి కాస్తా జల్లుకోనా
గుట్టు గుట్టుగా గుండెలోనే
వేడిగా వెచ్చగా ఉండిపోనా
మెత్తమెత్తగా ఉన్నవన్నీ
చాటుగా మాటుగా ఇచ్చుకోనా

మెల్లగా మెల్లగా
అల్లుకో అల్లుకో

మెల్లగా

మెల్లగా

ఆడ ఈడ ఉన్న ఆడ అందమంతా
ముద్దచేసి ముద్దుపెట్టి కొట్టమాకు
కన్నెఈడు సన్నకారు సోకులన్నీ
కౌగిలిస్తే లెక్కపెట్టి చంపమాకు
సల్ల గాలి పడగానే
బుల్లి కోక జారిపోయే
తాకే నీఊపిరి సాగించె అల్లరి
మోజులన్నీ పట్టుకోరా పోరగాడా
బొమ్మలాడుకోరా వాలు పొద్దుకాడ

మెల్లగా మెల్లగా
అల్లుకో అల్లుకో
మెత్తగా మెత్తగా
హత్తుకో హత్తుకో

చూడగానే చెప్పలేని రేఖలన్ని
ఏడు రంగులేసి చూసి రెచ్చిపోకూ
పుట్టు మచ్చ తాకలేని పూతలన్ని
గుచ్చి మాలలల్లుకుంటే నొచ్చుకోకు
కన్ను నీవు కొట్టగానే
గాజులమ్మ ఘల్లు మంటే
తగిలే నీ కాటుకా
రగిలే నా కోరికా
పండు దాచుకోకు పిట్టలాడు వేళ
అ పక్క దాటిపోకు చుక్కలాడు వేళ

మెల్లగా మెల్లగా
అల్లుకో అల్లుకో
మెత్తగా మెత్తగా
హత్తుకో హత్తుకో

అల్లుకుంటూ అందమంతా గిల్లుకోనా
హత్తుకుంటూ హాయి కాస్తా జల్లుకోనా
గుట్టు గుట్టుగా గుండెలోనే
వేడిగా వెచ్చగా ఉండిపోనా
మెత్తమెత్తగా ఉన్నవన్నీ
చాటుగా మాటుగా ఇచ్చుకోనా



Credits
Writer(s): Chakravarthy K
Lyrics powered by www.musixmatch.com

Link