Manasa Marchipo

(వేదనా శోధన)
(ఊపిరాగే భావనా)
ద్వేషమా ప్రాణమా
చేరువైతే నేరమా
ముల్లె ఉండని పువ్వులుండవా
కన్నీరుండని కళ్లులేవా
అలాలుండని సంద్రముండదా
ఏ కలలుండని జన్మ లేదా

మనసా మర్చిపో
లేదంటే చచ్చిపో
గతమా కాలిపో
మరుజన్మకి ఆశతో

గమ్యమే లేదని
తెలిసిన పయనమా
చీకటే లోకమా
చుక్కల్లో సూరీడా ప్రేమా

భూమి పాతాళం లోతున
పిచ్చివాడై స్వర్గాన్ని వెతకనా
ఉన్నా ఆకాశం అంచున
నువ్వు లేని నా కోసం బ్రతకనా
ప్రాణాలే పోతున్న నిందించలేకున్నా
నాలోనే నాతోనే నే ఉండలేకున్నా

గతమే తీయ్యగా బాధించే హాయిలా లో
పరదా తీయగా కనిపించే నిజమిలా
ఎటు చూడను ఇరువైపులా ప్రణయాలే ప్రళయమై
వెంటాడితే ఎం చేయను నేనే లేనుగా
ఏ తీరం చేరాలి చుక్కాని లేకుండా
నాదంటూ నాకంటూ ఉండొకటే నరకం

మనసా మర్చిపో లేదంటే చచ్చిపో
గతమా కాలిపో



Credits
Writer(s): Rajamanickam C, Bhupala Venkata Durga Prasad
Lyrics powered by www.musixmatch.com

Link