Sandhya

సంధ్యా పదపద పదమని అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు మొహమాటంతో ఇబ్బందా
నువు వణక్క తొణక్క బెరక్క సరిగ్గ ఉంటే చాలే
కథ వెనక్కి జరక్క చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి correct-u ముగింపు ఇపుడే ఇస్తాదే

మధ్యలో ఉన్నది దగ్గరో దూరమో కాస్తాయినా తెలిసిందా
ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం ఏమైనా బాగుందా
మాటలని కుక్కేశావే మనసు నిండా
వాటినిక పంపేదుందా పెదవి గుండా
బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక
అది ఎంతో అపచారం అని అనుకోవే చిలకా

సంధ్యా పదపద పదమని అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు మొహమాటంతో ఇబ్బందా

ఏం సరిపొద్దే నువు చూపే ప్రేమా
ఓ తెగ చూస్తే పనులేవీ కావమ్మా
పైకలా అవుపిస్తాడే ఎవరికైనా
వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా
విసిరావో గురిచూసి వలపన్న బాణమే
పడిపోదా వలలోనా పిలగాడి ప్రాణమే

సంధ్యా పదపద పదమని అంటే సిగ్గే ఆపిందా
ఔనే పొగరును ప్రేమతో మనిషిని చేస్తే మీ బావే
నువు వణక్క తొణక్క బెరక్క సరిగ్గ ఉంటే చాలే
కథ వెనక్కి జరక్క చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి correct-u ముగింపు ఇపుడే ఇస్తాదే

Credits
Writer(s): Sweekar Agasthi, Sanapati Bharadwaj Patrudu
Lyrics powered by www.musixmatch.com

Link