Nailu Nadi

నైలు నది ధారలాగ
ప్రవహించే నేడు తొలిప్రేమ స్వరం
జైలు గదిలాగే తోచే
నిను కలవలేని నా కలల వనం
ఎదలో ఆకాశాన్నంటే కేరింత
జతగా నే నీతోపాటే లేనంట
వలపిది ఇంతే ఎన్నటికైనా
ఏదో చాలని కొరతేగా
విడివిడి విరహపు అలజడిలోన
ప్రతి ఒక తలపు తీయని కవితేగా
నైలు నది ధారలాగ
ప్రవహించే నేడు తొలిప్రేమ స్వరం
జైలు గదిలాగే తోచే
నిను కలవలేని నా కలల వనం

అద్దం ముందు ఉన్నది
అందని మెరుపు
అందం వైపు లాగుతున్నది
తెరిచిన తలుపు
నాలుగు గోడలే అంచులుగా
మరో లోకం వెలిసింది
అయినా ఆగని అల్లరిగా
నా మది నీకై వెతికింది
పెరిగిన దూరం మరి కొంచం
ప్రేమని పెంచింది... ఓ ఓ
నైలు నది ధారలాగ
ప్రవహించే నేడు తొలిప్రేమ స్వరం
జైలు గదిలాగే తోచే
నిను కలవలేని నా కలల వనం

ఇక్కడున్న నేనిలా రెక్కలు తొడిగా
రెప్పపాటు వేగమై
నీ పక్కన ఒదిగా
మూసిన కన్నుల స్వప్నంగా
సమీపిస్తా సరసంగా
రంగులు పూసిన వెన్నెలలా
సముదాయిస్తా సరదాగా
ఎన్నాళ్ళైనా ఎడబాటు కొన్నాళ్ళేగా
నైలు నది ధారలాగ
ప్రవహించే నేడు తొలిప్రేమ స్వరం
జైలు గదిలాగే తోచే
నిను కలవలేని నా కలల వనం



Credits
Writer(s): Madhan Karky, Ramajogayya Sastry, Simon K King
Lyrics powered by www.musixmatch.com

Link