Ye Kommaki Ye Puvvo

ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో
ఏ చెట్టుకు ఏ కాయ కాయాలో
ఏ గువ్వులు ఏ గూడు చేరాలో
అన్నీ ముందుగ రాసే ఉంటడు
ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు
జరగాల్సింది ఆపే వాడు
ఏ గుండెకు ఎవ్వరు సవ్వడో
ఏ పెదవికి ఎవ్వరితో నవ్వులో
ఏ కథ ఏ తీరున సాగునో

అన్నీ ముందుగ రాసే ఉంటడు
ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు
జరగాల్సింది ఆపే వాడు
నువ్వడిగి పుట్టావా మీ అమ్మకు
నువ్వు చెప్పేమన్నొచ్చావా మీ అయ్యకు
నువ్వెంచుకున్నావా నీ ఊరిని
నీ తోడ బుట్టినవాళ్లు అయినోళ్లని
లేదు నీ చేతుల్లో ఏది బాధేలరా
ఇప్పటిదాకా జరిగిందంతా నేమరేయరా
అంతా మనమంచికే అనుకోవాలిరా
అట్టా జరిగింది గనుకే ఇపుడు ఇట్టుందిరా
విజయంలో ఉంటే నువ్వు
లోకానికి ఎరుకవుతవ్
ఓటమిలో ఉంటే నీకే
ఎరుకయితది ఈ లోకం
ఇట్టాగే వుండి పోదురయ్యో నీ జీవితం

అన్నీ ముందుగ రాసే ఉంటడు
ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది
ఆపే వాడు
అవరోధం దాటాకే అందును శిఖరం
గెలిచిన ప్రతివాడి కథ చూడు
నా మాటే నిఖరం
కొమ్మలపై పూసిన ఆకులు
నేలన రాలు
భూమిని చీల్చుకుని పుట్టిన
మొక్కలే వటవృక్షాలు
ఓటమి అవమానాలు ఊరికే రానేరావు
వస్తే ఏదో పాఠం నేర్పక పోనే పోవు
న్యాయం నీలో ఉంటే
నీకు ఎదురే లేదు
చేసిన సాయం తప్పా
ఏదీ నీతో రాదు
పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తాయి కష్టాలు
పోయిందేమున్నది ఇపుడు ఉన్నయిగా ప్రాణాలు
ఒక దారి మూసుకుపోతే
తెరిచుంటది ఇంకో రాదారి

అన్నీ ముందుగ రాసే ఉంటడు
ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు
జరగాల్సింది ఆపే వాడు



Credits
Writer(s): Charan Arjun
Lyrics powered by www.musixmatch.com

Link