Kunthi Kumari (From "Rowdigari Pellam")

కుంతీ కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం
కన్యాకుమారి తన కాలు జారి చేసింది నా జీవితం
క్షణకాల పాపం కనుమాయ చేసి తన పేగు తెంచిందిరా

లోకాలు పుట్టే ఆ మురికి తొట్టే నను కన్న కడుపాయెరా
కుంతీ కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం

నీలాలు కారే నా కళ్ళనిండా నీరెండె మిగిలిందిరా
పాలరాబోసే పసి గుండెలోన పగ నిండిపోయిందిరా
లోకాలు తిరిగి ఏకాకి లాగ శోఖాన్ని దాచానురా
గతమంత మరిచే గరళాన్ని తాగి బతుకీడ్చుతున్నానురా
కుంతీ కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం

నడివీధి రాళ్లే గుడిలోన పెట్టి దేవుణ్ణి చేశారురా
నను కన్న వాళ్లే నడి వీధినేసి నగుబాటు చేశారురా
ఏ దేవుడైన నాలాగ పుడితే ఈ బాధ తెలిసేదిరా
దీపాల గుడికి పాపాల ఒడికి తేడాలు తెలిసేవిరా

కుంతీ కుమారి తననోరు జారి రాసింది ఒక భారతం
కన్యాకుమారి తనకాలు జారి చేసింది నా జీవితం



Credits
Writer(s): Bappi Lahiri, Jaaladi
Lyrics powered by www.musixmatch.com

Link