Kotha Kothaga

కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగానే
కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది

నా కన్ను ముద్దాడితే
కన్నె కులుకాయే కనకాంబరం
నా చెంప సంపెంగలో
కెంపు రంగాయే తొలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఉద్యోగం ఇప్పించవా
సోకు ఉద్యాన వనమాలిగా
జీతమియ్యనా లేత వన్నెలే చెల్లించుకోనా

కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగానే
కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది

నీ నవ్వు ముద్దాడితే
మల్లెపువ్వాయే నా యవ్వనం
నాజుకు మందారమే
ముళ్ల రోజాగ మారే క్షణం
మొగలి పరిమళం మొగాడి కౌగిలి
మగువ పరువశం సుఖాల లోగిలి
మొగలి పరిమళం మొగాడి కౌగిలి
మగువ పరువశం సుఖాల లోగిలి
కండల్లో వైశాఖమా
కైపు ఎండల్లో కరిగించుమా
తీగ మల్లికి
నరాల పందిరి అందించుకోనా

కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగానే
కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది



Credits
Writer(s): Ilaiyaraaja, Sastry Seetharama
Lyrics powered by www.musixmatch.com

Link