Paatashaala (From "Yuvarathnaa (Telugu)")

కాపాడే సైన్యం పోషించే సేద్యం
బ్రతుకంతా గురువంటా తానే
వివరాలే లేని విడి అక్షరాన్ని
అర్థంగా మార్చేది తానే
తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి
నీలో చిత్తశుద్ధికి తానే వాది
సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి
నీలో సాధనకెళ్ళా ఇదిగో ఆది
పాఠశాల
పాఠశాల
పాఠశాల
పాఠశాల

కాపాడే సైన్యం పోషించే సేద్యం
బ్రతుకంతా గురువంటా తానే
వివరాలే లేని విడి అక్షరాన్ని
అర్థంగా మార్చేది తానే

నీమాటేదైనా ఈ చోటుదే
ఏ స్నేహమైన ఈ మాటుదే
ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే ఏ దిక్కుకైనా నీ రెక్కిదే
రాజు పేద లేని రాజ్యంరా తన పేరు
రాగద్వేషం లేని సేవకు మారు
రా బడికంటూ పిలిచి రాబడిగా మారేను
గడిగడి తోడే నిలిచే గొడుగే తాను

నిమిషం విలువలు నీకు బడి గంటే నేర్పింది
నిలబడు నాయకుడల్లే నిను మార్చింది
ఎంతటి గురి నీకున్నా వెన్నుగ గురువే ఉంది
నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏదీ
పాఠశాల
పాఠశాల
పాఠశాల
పాఠశాల

నేర్పింది మీరే కలిసుండటం
చెప్పింది మీరే పంచివ్వడం
చూపింది మీరే గుర్తించడం తెలిపింది మీరే జీవించడం
శిక్షణ శిక్షగా కాదు రక్షణగా మార్చారు
పుస్తకమయ్యే గెలుపుకు నక్షా మీరు
పెరిగాడంటే ఒకడు తల్లీదండ్రుల పేరు
ఎదిగాడంటే మాత్రం గురువుల సౌరు

పదవిని నమ్మిన వాడు అవ్వొచ్చు పేదోడు
చదువును నమ్మిన వాడు ఎపుడూ కాడు
Mark-uల పట్టా ఎపుడూ నీ విలువే కాబోదు
విషయం వినయం మించిన విజయం లేదు
పాఠశాల
పాఠశాల
పాఠశాల
పాఠశాల



Credits
Writer(s): Santhosh Ananddram, Thaman S
Lyrics powered by www.musixmatch.com

Link