Thala Midha Sutta

తలమీద సుట్టబట్ట ఆపైన పండ్లతట్ట
తలమీద సుట్టబట్ట ఆపైన పండ్లతట్ట
పండ్లు పండ్లమ్మోయ్ అంటు పళ్ళెంత తీరుగుకుంటు
(పల్లె అంత తీరుగుకుంటు)
భాదర్లా గుసుండమ్మీ బత్తుకెళ్ళే తీసుకున్న
తెనుగొల్ల ఎల్లమ్మ ఏది మా పల్లెళ్ళల్లా, కండ్లళ్ళ కానరదేమి
తెనుగొల్ల ఎల్లమ్మ ఏది మా పల్లెళ్ళల్లా, కండ్లళ్ళ కానరదేమి

కమ్మకత్తి తీసి కొమ్మల్లాన్ని కోసి
కమ్మకత్తి తీసి కొమ్మల్లాన్ని కోసి
జిట్టిత పండ్లు తెంపి, బుట్టల్లా బోసుకొని
బుట్టల్లా బోసుకొని)
(కట్టమనక తిరిగి అమ్మి, పొట్టబోసుకున్న
తెనుగొల్ల ఎల్లమ్మ ఏది మా పల్లెళ్ళల్లా, కండ్లళ్ళ కానరదేమి
తెనుగొల్ల ఎల్లమ్మ ఏది మా పల్లెళ్ళల్లా, కండ్లళ్ళ కానరదేమి

నల్లతుమ్మెదల వోలె అల్లనేరేడు పండ్లు
నల్లతుమ్మెదల వోలె అల్లనేరేడు పండ్లు
భళ్ళున తెల్లరంగా డొల్లల్లా నింపుకొని
(డొల్లల్లా నింపుకొని)
ఇల్లూ ఇల్లూ తెరిగమ్మి ఇల్లెళ్ళ తీసుకున్న
తెనుగొల్ల ఎల్లమ్మ ఏది నా చిన్ననాటి అనవల్లెడ లేవేమీ
తెనుగొల్ల ఎల్లమ్మ ఏది నా చిన్ననాటి అనవల్లెడ లేవేమీ

చెరువుల్లో తుంపగడ్డ చేతనైనంత పీకి
చెరువుల్లో తుంపగడ్డ చేతనైనంత పీకి
కట్టెలపొయ్యి మీద కమ్మంగా ఉడుకబెట్టి
(కమ్మంగా ఉడుకబెట్టి)
ఉడికీన తుంపగడ్డలు ఊరు ఊరంతా అమ్మే
తెనుగొల్ల ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ పల్లెల్లో కానరదేమీ
తెనుగొల్ల ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ పల్లెల్లో కానరదేమీ

చింతచిగురు దూసి చిన చిన్న కుప్పలుబోసి
చింతచిగురు దూసి చిన చిన్న కుప్పలుబోసి
వడ్ల గింజాలు పెడితే వొట్టిచాపల పులుసు
(వొట్టిచాపల పులుసు)
ఓండుకుంటే చాలు వడాకట్టంత వాసన
ఆ రోజులు ఎడవయేనా మా పల్లెళ్ళల్లా ఎల్లమ్మ ఏమైపోయేనా
ఆ రోజులు ఎడవయేనా మా పల్లెళ్ళల్లా ఎల్లమ్మ ఏమైపోయేనా

సీమసింత కాయలమ్మే సిటీపల్క పండ్లు అమ్మే
సీమసింత కాయలమ్మే సిటీపల్క పండ్లు అమ్మే
కందగడ్డతో పాటు కందికాయ ఉడికేసమ్మే
(కందికాయ ఉడికేసమ్మే)
అనుబఆర్ సింతకాయ శేనిగే గూడలు ఎవ్వి
ఉలువకట్ట ఊసే లెదమ్మో మా పల్లెళ్ళల్లా ఉసిన జడలేదమ్మో
ఉలువకట్ట ఊసే లెదమ్మో మా పల్లెళ్ళల్లా ఉసిన జడలేదమ్మో

అడవిని గుత్తాబట్టి ఆడనే పొయ్యిబెట్టి
అడవిని గుత్తాబట్టి ఆడనే పొయ్యిబెట్టి
తిండిగింజలకొఱకు తెప్పలేంతో బడుతూ
(తెప్పలేంతో బడుతూ)
కండ్లళ్ళ ఒత్తులేసుక కావాళ్ళు గసిన తల్లి
తెనుగొల్ల ఎల్లమ్మ ఏమాయే పళ్ళెంతజూడ కండ్లల్ల నల్లవుసయే
తెనుగొల్ల ఎల్లమ్మ ఏమాయే పళ్ళెంతజూడ కండ్లల్ల నల్లవుసయే

తల్లి కోడి చుట్టూ పిల్లలు తెరిగినట్టు
తల్లి కోడి చుట్టూ పిల్లలు తెరిగినట్టు
బంటోళ్ల తల్లి గంపా సుట్టు పిల్లలగుంపు
(సుట్టు పిల్లలగుంపు)
రెండు పావుల దినుసుకోక్క పవేడు పండు
పెడితే బుద్దెడా దారేది, గా సన్నెపండు కోసరేసి బుజ్జగించేది
పెడితే బుద్దెడా దారేది, గా సన్నెపండు కోసరేసి బుజ్జగించేది

చెరువు కుంటలు బాయే వలల్లాన్ని సీకిపోయే
చెరువు కుంటలు బాయే వలల్లాన్ని సీకిపోయే
ముదిరాజులు కన్నా కళలు, గంగాల గలిసిపాయే
(గంగాల గలిసిపాయే)
పొంగిపొర్లేటి వాగు వంకళాన్ని ఎండిపోగా
గూడు చెదిరిన పక్షుల్లా ముదిరాజు బిడ్డలు గూడలు వదిలిపోతుండ్రా
గూడు చెదిరిన పక్షుల్లా ముదిరాజు బిడ్డలు గూడలు వదిలిపోతుండ్రా

దోనలల్లో తునికిపండ్లు దొరికిన ఉనికే లేదు
దోనలల్లో తునికిపండ్లు దొరికిన ఉనికే లేదు
చిలకకోరికిన జమ పండ్ల ఎరుక ఎడలేదు
(పండ్ల ఎరుక ఎడలేదు)
పండ్లు కాయలతో పల్లె పలువారిల్లేదిబోయి
పోరుక పొరుకయ్యిపోతుందో మా పల్లెసీమ ఎరుకే మరిపోతుందో
పోరుక పొరుకయ్యిపోతుందో మా పల్లెసీమ ఎరుకే మరిపోతుందో

ముంతమామిడి పండ్ల ముచ్చట్లు లెనేలేవు
ముంతమామిడి పండ్ల ముచ్చట్లు లెనేలేవు
చిలకమ్మ కలికిపండ్ల పలుకుల జాడలేవి
(పలుకుల జాడలేవి)
కంటాజూదమ్మ జుంటితేనే లేదు
అడివంత మాయమవుతుందో మా పల్లెతల్లి అల్లడిపోతా ఉన్నదో
అడివంత మాయమవుతుందో మా పల్లెతల్లి అల్లడిపోతా ఉన్నదో

చింతచెట్లు ఎవడు నరికె శిథిలమైనట్టు ఊరు
చింతచెట్లు ఎవడు నరికె శిథిలమైనట్టు ఊరు
కనీకణాల మధ్య కరువు రాకాశిదాడి
(కరువు రాకాశిదాడి)
పట్టణాలకు వలస పళ్ళెంత బోసిబోయి
గోసెల్లా బోస్తా ఉన్నదో తన బ్రతుకుడేరువు కొరకు పోరాడుతున్నదో
గోసెల్లా బోస్తా ఉన్నదో తన బ్రతుకుడేరువు కొరకు పోరాడుతున్నదో

Credits
Writer(s): Vandemataram Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link