Lede E Samshayam

లేదే ఏ సంశయం
రెక్క విప్పి మనసు నింగికి ఎగిరే
నిన్నే నువ్వే ఇలా కలిసే సమయం
చేసేయ్ నీ సంతకం
రంగులెన్నో చిలికి జీవితంపై
స్నేహం నీ తోడుగా సాగేయి పయనం

కన్నుల్లో కలల్నేయ్
కలుసుకో నేడు
వనంలో
మనంలో హద్దులు అడ్డు పెట్టమాకు
ఏ అవధులు లేని ఆటవిడుపు
అలుపు లేక ఆక్రమించు
ఆకాశాన్నే అధికమించేసెను
కరుగుతున్న క్షణములన్న విధి
మార్చుకోరా అనుభవాల నిధి
అందమైన బ్రతుకంటే అర్థం ఇది

తపించే ప్రతి నిమిషం
నిలిచి పోవాలని
కథల్లో ఓ కథై నువ్వు
ఏ అణువణువంత విశ్వామేగా
నీకే నువ్వు సాక్షమవగా
అంతేయ్ లేని లోకం అంచులనే తాకరా
ఓ జ్ఞానం మందికి వేదమవగా
వేదం నీలో కదిలే నదిగా
నిన్నే నువ్విలా చిత్రించాలిరా కొత్తగా

రాదే ఈ నిమిషం
కావాలంటే మళ్ళి
నీదే ఈ జీవితం
వందేళ్ల ఓ మజిలీ

లేదే ఏ సంశయం
రెక్క విప్పి మనసు నింగికి ఎగిరే
నిన్నే నువ్వే ఇలా కలిసే సమయం
చేసేయ్ నీ సంతకం
రంగులెన్నో చిలికి జీవితంపై
స్నేహం నీ తోడుగా సాగేయి పయనం



Credits
Writer(s): Pavan, Mahesh Poloju
Lyrics powered by www.musixmatch.com

Link