Hands Up

సాహోరే సభా ప్రాంగణం
వినుకో నా వీర ప్రకరణం
ఖాకి పై ప్రమాణం నా ప్రయాణం
కత్తి అంచేగా ఒక్కో క్షణం
కర్తవ్యం ధర్మ రక్షణం
పిస్తూలే హస్త భూషణం
చట్టం నా కిరీటం, ధర్మమే పీఠం
లోక కల్యాణమే కంకణం
నీలాంటి దమ్మున్నోడు
తన గన్ను పేరు hands up అన్నోడు
కొత్తగ ఊళ్ళో దిగాడు నువ్వేనా అతగాడు
(Hands up) నా ప్రతి శబ్ధం
(Hands up) నా నిశ్శబ్ధం
(Hands up) ఓ అణుయుద్ధం
నా పాత్రకు ఉందో పరమార్ధం

అలనాటిదే నాటకం నా వాలకమొకటే ఆధునికం
నా దృష్టి దుర్మార్గులకు దుష్టులకు ప్రాణాంతకం
కైవసమై లొంగిపోదా అందని ఎత్తున ఆకశం
నన్నసలు గెలవాలన్న ఆ తలపే దుస్సాహసం
భళి భళి నూతనాధ్యాయము ఇకపై నీదే నాయకా
నవశకం మొదలెట్టరా ఆలోచించక
భూకంపాల ఢద పుట్టించాలి చెడు గుండెల్లో నీ సింహ-నాదం
నా పాత్రకు ఉందో పరమార్ధం

వీడో అరుదైన అద్భుతం
మగసిరి గల నిండు విగ్రహం
వీడుంటే భయం భయపడి పారిపోతుంది దూరం దూరం
కను చూపే కాంతి నక్షత్రం
శరణార్ధుల పాలనే సూత్రం
భుజ బలమే తోడైనా బుద్ధి బలంతో అందుకుంటాడు నీరాజనం
జగమే మాయాబజారు, జగత్ ఖిలాడి-లుంటారు
మన పేరుని కొంచెం వినిపిస్తే పద్దతిగ పడి ఉంటారు
Hands up (నీ ప్రతి శబ్ధం)
Hands up (నీ నిశ్శబ్ధం)
Hands up (ఓ అణుయుద్ధం)
నా పాత్రకు ఉందో పరమార్ధం



Credits
Writer(s): Ajaneesh Loknath B, Nagarjun Sharma
Lyrics powered by www.musixmatch.com

Link